బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- నాగోల్‌లో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం
- హాజరైన శాఖ మంత్రి కొండా సురేఖ
నాగోల్, మే 14 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభ్యున్నతి, సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నాగోల్ డివిజన్ వసంత విహార్‌లో గురువారం బాస్ ఆధ్వర్యంలో నిర్వ హించిన తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యంలతో ప్రమాణ స్వీకా రం చేయించి బాధ్యతల పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లా డు బ్రాహ్మణుల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయని, అలాంటి కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. బ్రాహ్మ ణ సంక్షేమ పరిషత్తు ద్వారా సమాజానికి సేవ చేసే వారిని సభ్యులుగా ఎంపిక చేసి పరిషత్తును మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అర్చక వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులను కేటాయించిందని వెల్లడించారు. బ్రాహ్మణ సంఘాలు, ఉపవర్గాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి పరిషత్తుకు సహకరించాలని వారు సూచించారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్ బా బు, కొండా సురేఖలకు కృతజ్ఞతలు తెలిపా రు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, రాష్ట్రంలోని ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి అండగా నిలుస్తాన ని తెలిపారు. వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యం కూడా మాట్లాడారు.
ఈ కార్య క్రమంలో రాష్ట్ర సంస్థల అధ్యక్షుడు మల్‌రెడ్డి రాంరెడ్డి, చల్ల నరసింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అధికార ప్రతినిధి శ్రీ సత్యం శ్రీరంగం, ప్రోగ్రాం కన్వీనర్ నందిరాజు లక్ష్మీనారాయణ, బాస్ ప్రతి నిధులు వక్కలంక శ్రీనివాస్, ఎం.వి శాస్త్రి, ఆర్సీ మూర్తి, కైలాష్తో పాటు రాష్ట్రంలోని వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






