06-08-2025 12:00:00 AM
ఏదులాపురం మున్సిపల్ ప్రాంతంలో పర్యటించి పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, ఆగస్టు 5 ( విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, స మాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంగళవారం ఏదులాపురం జెడ్పీ హైస్కూ ల్ ఆవరణలో పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్, ఏదులాపురం మునిసిపల్ పరిధిలో 1వ, 59వ, 60వ డివిజన్ లలో 8 వ తరగతి చదివే ఆడ పిల్లలకు సైకిల్లు పం పిణీ చేసారు.
ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ గత ఏడాది పాలేరు నియోజక వర్గంలోని 8 నుంచి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు సైకిల్లు పం పిణీ చేశామని మంత్రి గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం 8వ తరగతి వచ్చిన బాలికలకు, ఇంటర్ ప్ర భుత్వ కళాశాలల్లో కొత్తగా చేరిన బాలికలకు సైకిల్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
నేడు ఏదులాపురం మున్సిపాలిటీలో, ఖమ్మం కా ర్పొరేషన్ పరిధిలో 3 డివిజన్ కలుపుకుని 191 సైకిల్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. డ్రాప్ ఔట్ తగ్గాలని, బాలికల విద్య ప్రోత్సహించాలని వ్యక్తిగతంగా ట్రస్ట్ నుంచి అం దిస్తున్నామని అన్నారు.పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు కొవ్వొత్తుల కరిగి పోతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనల్ని చదివిస్తున్న అమ్మా, నాన్నలను గుర్తు చేసుకుంటూ మనం పెట్టుకున్న లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులు కృషి చే యాలని, తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అన్నారు.
విద్య, వైద్య రంగాలకు ప్రభు త్వం పెద్దపీట వేసిందని అన్నారు. గతంలో గురుకులాల్లో పిల్లలకు సరైన ఆహారం పెట్టలేదని అన్నారు. ఎన్నికల సమయంలో హా మి ఇవ్వకపోయినా గురుకులాల దుస్థితి చూ సి 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కా స్మోటిక్స్ చార్జిలను పెంచామని అన్నారు. వి ద్యార్దులలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసి జీవనోపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసామని తెలిపారు.
పాలేరు నియోజక వర్గంలో 46 కోట్లతో ఐటిఐ మంజూరు చేయడం జరిగిందని, త్వరలో తిరుమలాయ పాలెం లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఏదులాపురంలో గత ప్రభుత్వం పేరుకు జేఎన్టియూ కళాశాల మంజూరు చేస్తే మన ప్రభుత్వం రా గానే మొదటి విడత 110 కోట్లు మంజూరు చేసామని, త్వరలో ఈ పనులు పూర్తి చేస్తామని అన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాల తో 200 కోట్లతో 3 వేలకు పైగా పిల్లలు చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసుకున్నామని అన్నారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ, నూతనంగా మెగా డి.ఎస్సీ ద్వారా 11 వేల ఉపాధ్యాయులను ఇందిరమ్మ ప్రభుత్వం నియమించింద ని, అంతేకాకుండా 30 వేలమంది టీచర్ల ప దోన్నతులు, బదిలీలు పారదర్శకంగా పూర్తి చేసామని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ విద్యాధికా రి నాగ పద్మజ, ఖమ్మం ఆర్డీవో నర్సింహారా వు, ఏదులాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీ నివాస రెడ్డి, ఎంఇఓ శ్రీనివాసరావు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, జెడ్పిహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.