06-08-2025 12:00:00 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బూర్గుడ గ్రామ శివారులో ఉన్న గిరిజన మహిళ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఎంపీసీఎస్ పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థిని అనసూయ హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ గణిత విభాగంలో సీటు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శారద తెలిపారు. పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరచి సీటును దక్కించుకున్నట్లు తెలిపారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి సుజాత, కళా శాల సిబ్బంది అభినందించారు.