06-08-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 5: పేదల వైద్యంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కలెక్టర్ దీపక్ కుమార్ అన్నారు. మంగళవా రం బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని, కన్నెపల్లి మండలాలను సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ముందుగా భీమిని మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మళ్లీడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.
కస్తూరిబా గాంధీ విద్యాలయంలో అందుతున్న సౌకర్యాలను అక్కడి విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల నిర్వహణ సక్ర మంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శి కి షోకాజ్ నోటీస్ అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అదేవిధంగా కన్నెపల్లి మండల కేంద్రంలో నూతనంగా చేపడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించా రు.
ఆరోగ్య కేంద్రాన్ని త్వరితగతన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యతోపా టు మంచి భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యాలయాల్లో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ దీపక్ కుమార్ వెంట భీమి ని, కన్నెపల్లి ఎంపీడీవోలు గంగ మోహన్, శ్రీనివాసరెడ్డిలతోపాటు పలువురు అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థులకు చేరువలో.. పాఠశాల ఏర్పాటుకు చర్యలు
ప్రభుత్వం విద్యారంగ బలోపేతం దిశగా చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు చేరువలో పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళ వారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని రామ్‌నగర్ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించా రు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పి స్తూ నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరమ్మత్తులు అవసరం కలిగిన పాఠశాల భవ నాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. రామ్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలమైనందున, స్థానిక విద్యార్థులకు విద్యను అందించేందుకు నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.