calender_icon.png 11 August, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటిష్ఠంగా మన్సూన్ డ్రైవ్

31-07-2025 01:14:00 AM

- జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

- క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాదును ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. బుధవారం ఉదయం కూకట్‌పల్లి, ఖైరతాబాద్ జోన్లలో జోనల్ కమిషనర్లు అపూర్వ్ చౌహాన్, అనురాగ్ జయంతిలతో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు.

వ్యర్థాల సకాలంలో తొలగింపు, దోమల నివారణ స్ప్రేలు (ఫాగింగ్, యాంటీ లార్వా), పార్కులు, కాలనీలు, నీరు నిలిచే ప్రదేశాల్లో పరిశుభ్రత చర్యలు, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఖైరతాబాద్ సర్కిల్లో అమీర్పేట్, పంజాగుట్ట, బేగంపేట్ ప్రాంతాలను జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి కమిషనర్ వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించారు.