calender_icon.png 11 November, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కార్యాలయంలో జయంతి

11-11-2025 05:12:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): కలెక్టరేట్‌లో మంగళవారం భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని, విద్యా రంగ అభివృద్ధికి, మైనారిటీలు, మహిళా విద్యా ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మైనార్టీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఏ.ఓ.ఖాళీఖ్ అహ్మద్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మైనార్టీ సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.