03-07-2025 12:00:00 AM
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య పిలుపు
ములకలపల్లి, జూలై 2 (విజయ క్రాంతి); ప్రజా పోరాటాల తోనే సమస్యలు పరిష్కారం అవుతాయని భవిష్యత్తు కాలం అంతా కమ్యూనిస్టులదేనని సిపి ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు. బుధ వారం మండల కేంద్రంలోని రాయల్ పంక్షన్ హాల్ లో రెండు రోజుల పాటు నిర్వహించిన సిపిఎం శిక్షణా తరగతులు బుధవారంతో ముగిసాయి. ఈ శిక్షణ తరగతుల్లో పార్టీ నిర్మాణం-పని పద్దతులు అనే అంశంపై అన్నవరపు కనకయ్య మాట్లాడారు. గ్రామ స్థాయి ప్రజా పోరాటాలతో పార్టీ ని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రాథమిక హక్కులపైన లౌకిక ప్రజాస్వామ్యం పైన దాడికి ప్రయత్నిస్తుందని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు చేయాలన్నారు.టైగర్ జోన్ పేరుతో అదివాసీలను ఆదివాసీ గ్రామలను అడవి కి దూరం చేసే కుట్ర మానుకోకపోతే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు మండల నాయకులు వూకంటి రవికుమార్, నిమ్మల మధు, పోడియం వెంకటేశ్వర్లు,మాలోతు రావూజా, గౌరీ నాగేశ్వరరావు,పాయం అమల, సోయం కృష్ణ, అనసూర్య,గోపగాని లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.