03-07-2025 12:00:00 AM
చారకొండ జూలై 2: ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో ప్రభు త్వం కొండంత భరోసాను కల్పిస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గౌడ్, మం డల అధ్యక్షులు బాలరాం గౌడ్, యూత్ కాం గ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని జైపా ల్ అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, లబ్ధిదారులకు ప్రోసిడింగ్లు అందజేశారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చి పేదలకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో ఎన్‌ఎస్ యూఐ మండల అధ్యక్షు డు గోరేటి శివ నాయకులు ప్రభాకర్ రావు , నాగార్జున, రాజు, కృష్ణయ్య , యాదయ్య, నరసింహారెడ్డి, రామస్వామి, వెంకటయ్య, రాములు, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.