calender_icon.png 7 July, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో శ్రీ కుసుమ హరినాథ్ బాబా 160వ జయంతి

03-07-2025 12:00:00 AM

భద్రాచలం, జులై 2 (విజయ క్రాంతి); భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనిభద్రాచలంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం అతి సమీపాన రంగానాయకుల గుట్ట మీద నెలకొన ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా దేవస్థానం లో బుధవారం శ్రీ స్వామివారి160 వ జన్మదినం సందర్భంగా శ్రీ స్వామివారికి పంచా మృతాలుతో అభిషేకం అలంకరణ, స్వామివారికి.

విశేష పూజలు, తదుపరి తీర్థ ప్రసాద వినియోగం జరిగింది పూజా కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ యక్కటి శ్రీనివాసరావు. సభ్యులు తంబళ్ల కృష్ణార్జునరావు, శ్రీరంగం నరసింహ చార్యులు, పునుగుపాటి సీత, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ చైర్మన్ గంగా భారతి, ఆలయ సిబ్బంది చారి భక్తులు ఆలయ అర్చకులు శ్రీరంగం నరసింహచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాభక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.