వంట కార్మికుల సమస్యలపై పోరాటం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు
ముషీరాబాద్, మార్చి 16(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకానికి కేటాయింపులు పెంచాలని, అలాగే వంట కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరా టం చేస్తానని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నా రు.
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎఐటియుసి అనుబంధ సం ఘం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవా రం చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగం గా ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా కార్యక్రమం యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. ప్రేంపావని అధ్యక్షత జరిగింది. ఈ ధర్నాకు ఎమ్మెల్యే కూనంనేని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ వంట కార్మికులు అసెంబ్లీ వెలుపల పోరాటాల ద్వారా హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ ధర్నా లో ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్రాజ్, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ బివి. విజయలక్ష్మి, పి. ప్రేమ్ పావని, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేశ్, గౌరవాధ్యక్షురాలు డి. కమలారెడ్డి, ఉపాధ్యక్షులు టి. చక్రపాణి, కె. సుగుణ, కుంటాల రాములు, కార్యదర్శులు రామక్రిష్ణ, లక్ష్మణ్, కోశాధికారి రంగారెడ్డిలతో పాటు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.




