calender_icon.png 14 July, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెస్ట్ లెక్చరర్ లను రెన్యువల్ చేయాలి..

14-07-2025 04:41:28 PM

కలెక్టరేట్ ఎదుట నిరసన..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): త్రీ మెస్ కమిటీతో డెమో తీసుకునే విధానాన్ని రద్దు చేసి, గత సంవత్సరంలో పని చేసిన ప్రతి డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ లను రెన్యువల్ చేసి సర్వీస్ కంటిన్యూ చేయాలని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్(Guest Lecturers Association) జిల్లా అధ్యక్షులు రాహుల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం డిగ్రీ కళాశాల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాలలు ప్రారంభమై 40 రోజులైనా డిగ్రీ గెస్ట్ లెక్చరర్ లకు రెన్యువల్ చేయకుండా కాలయాపన చేయడంతో అధ్యాపకులకు, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో 8 యూనివర్సిటీల పరిధిలోని 149 డిగ్రీ కళాశాలలో 1,940 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారని, తమ సేవల పైననే 30 నుండి 90% వరకు కళాశాలలు నడుస్తున్నాయన్నారు. గత సంవత్సరంలో పని చేసిన వారిని రెన్యువల్ తో సర్వీస్ కంటిన్యూ చేయకపోవడంతో విద్యార్థులకు పాఠాలు బోధించే అవకాశం లేకుండా పోయిందని, దీంతో సిలబస్ కాక పాఠాలు అర్థం చేసుకోలేక విద్యార్థుల సందేహాలు తీర్చేవారు లేక విద్యార్థులు అయోమయ గందరగోళ పరిస్థితిలో అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు సుభాష్, కోశాధికారి ఆనంద్, నారాయణ, జావిద్, ప్రవీణ్ కుమార్, వివిధ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు