calender_icon.png 6 December, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు అద్దంకి కౌంటర్

06-12-2025 11:57:30 AM

బీఆర్ఎస్ కు మనుగడ కష్టం

హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Congress MLC Addanki Dayakar) కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని ఢీకునే నాయకత్వం బీజేపీ, బీఆర్ఎస్ లో లేదని ఎద్దేవా చేశారు. ప్రజామోదంతో రేవంత్ రెడ్డి బలమైన శక్తిగా ఎదిగారని సూచించారు. కేసీఆర్ బయటకు రానంతకాలం బీఆర్ఎస్ కు మనుగడే కష్టం అన్నారు. కేసీఆర్ బయటకు రాకపోతే ఏదో ఒక పార్టీకి బీఆర్ఎస్ ధారాదత్తం తప్పదన్నారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ దివాళా పార్టీగా మారుతుందని తెలిపారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి రేవంత్ పాలనతోనే సాధ్యమని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి అధికారం మళ్ళీ రావడం అనేది కల అన్నారు. కేటీఆర్ ని ముందుకు నెట్టి నాయకత్వాన్ని కేసీఆర్ పరీక్షించారని, కానీ కేటీఆర్ టెస్టులో ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. హరీష్ రావు కూడా అనుమానాస్పదంగానే ఉన్నాడని అద్దంకి జోస్యం చెప్పారు.