07-11-2025 01:48:28 PM
వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్,
వేములవాడ టౌన్, (విజయక్రాంతి): చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ అన్నారు. పట్టణంలోని వివేకానంద హై స్కూల్ విద్యార్థులు కూరగాయల మార్కెట్, పబ్లిక్ మున్సిపల్ పార్క్ తో పాటు పోలీస్ స్టేషన్ ను శుక్రవారం సందర్శించారు. పోలీసుల పని తీరును సమాజం లో పోలీసుల పాత్ర పై విద్యార్థులకు వివరించారు. అనంతరం సీఐ వీరప్రసాద్ విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థి దశనుండే ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, మైనర్ లు వాహనాలు నడపొద్దని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఓ విద్యార్థి పోలీసులు ఖైదీని ఎన్ని సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు అని అడగగా సీఐ సమాధానం ఇచ్చారు పోలీసులు కేవలం 24 గంటల లోపు మాత్రమే అరెస్టు చేయగలరని, 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.