12-09-2025 12:00:00 AM
జిల్లా విద్యాధికారి కే.రాము
ధర్మపురి,సెప్టెంబర్11(విజయక్రాంతి): తెలుగు భాషా ఉపాధ్యాయులు విద్యార్థులను మాతృభాషలో ఔన్నత్వంగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాధికారి కే .రాము సూచించారు. వెల్గటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉన్నతస్థాయి తెలుగు ఉపాధ్యాయుల పాఠశాల సముదాయ సమావేశాన్ని ఆయన ఆకస్మికంగా పర్యవేక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష బోధన కేవలం పాఠ్య పుస్తకానికి పరి మితం కాకుండా విభిన్న ప్రక్రియలలో విద్యార్థులకు ఆలోచనా శక్తిని పెంపొందించేలా కృ షి చేయాలని సూచించారు.
వివిధ రకాల పోటీ పరీక్షలు విద్యార్థులు తెలుగును ఆప్షనల్ గా ఎంచుకునే స్థాయికి వారిని తీర్చిది ద్దాలని అభిప్రాయపడ్డారు. తెలుగు మాధ్యమంలో బీటెక్ లాంటి ఉన్నత చదువులు చ దువుతున్న విద్యార్థులు మంచి విజయాలు సాధించారని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని అం దరూ మాతృభాష ఉద్యమంలో భాగస్వాములు కావాలని భాషా ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డిజిటల్ బోధన తదితర అంశాల గురించి సమాజంలో ప్రచారం కల్పించకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలు నిరాదరణకు గురయ్యే పరిస్థితి ఎదురవుతుందన్నారు. సముదాయ సమావేశంలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో విజయవంతంగా అమలుపరచాలని, బోధనాభ్యాసన ప్రక్రియలను పరస్పరం పంచుకుంటూ వ్యవస్థలో ఒక శక్తిగా మరింత సమర్థవంతంగా ముం దుకు సాగాలని ఆయన మార్గదర్శనం చేశా రు. మాతృభాష బోధనలో జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వెల్గటూర్, గొల్లపల్లి మం డల విద్యాధికారులు బోనగిరి ప్రభాకర్, చెరుకు రాజన్న, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చిప్ప నందయ్య, తెలుగు డిఆర్పి డా.కస్తూరి వేణుగోపాల్, సబ్జెక్ట్ ఆర్పి జె చంద్రశేఖర్, సి ఆర్ పి వైద్య వెంకటేష్, వెల్గటూరు, ఎండపల్లి, గొల్లపల్లి మండల లోని ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలలో బోధిం చే తెలు గు ఉపాధ్యాయులుపాల్గొన్నారు.