12-09-2025 12:00:00 AM
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, సెప్టెంబర్ 11: ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల పట్టణంలోని ఈశ్వరి బ్యాంకెట్ హాల్ లో చేవెళ్ల మండలానికి సంబంధించిన ఉత్తమ ఉపాధ్యాయులు, మొయినాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మొయినాబాద్ మండలానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి.. జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. బోధన అంటే కేవలం పాఠాలు చెప్పడం కాదని, విద్యార్థిలను మంచి పౌరులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యతని సూచించారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యా రంగ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సీసీ రోడ్లకు శంకుస్థాపన
చేవెళ్ల మండలం సింగప్పగూడలో హెచ్‌ఎండీఏ నిధులు రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో వీధి దీపాల ఏర్పాటుకు గురువారం ఎమ్మెల్యే యాదయ్య శంకుప్థాపన చేశారు. అలాగే ఎన్కేపల్లి లో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో స్టీట్ లైట్స్, ఈర్లపల్లి గ్రామంలో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో హైమాస్ట్ లైట్లు, మున్సిపల్ పరిధి మల్కాపూర్ వార్డులో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, పామెన వార్డులో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో మట్టి రోడ్ల నిర్మాణానికి భూమిపూజలు చేశారు. అనంతరం అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న పామెనకు వార్డుకు ఎందిన తుమ్మలపల్లి నాగమణి కుటుంబ సభ్యులకు రూ.2.25 లక్షల ఎల్ వోసీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల్ పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్ రెడ్డి, ప్రతాప్రెడ్డి, మాజీ సర్పంచ్లు బండారు శైలజాఆగిరెడ్డి, రాజశేఖర్, దావల్గారి గోపాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవీందర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర క్యాంపెయినింగ్ కమిటీ జాయింట్ కన్వీనర్ వసంతం, కమిషనర్ వెంకటేశం, కాంగ్రెస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు వీరేందర్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.