calender_icon.png 28 November, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి

27-11-2025 12:00:00 AM

* నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి 

* పాఠశాల ప్రధానాచార్యులు గోలి జగన్నాథం 

మానకొండూరు, నవంబర్, 26 (విజయక్రాంతి) : విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటి స్తూ, మానసికంగా దృఢంగా ఉండాలని దేవంపల్లి సాంఘిక సంక్షేమ ప్రతిభా గురుకుల పాఠశాల ప్రధానాచార్యులు గోలి జగ న్నాథం విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించా లని విద్యార్థులను కోరారు. రాష్ట్రీయ బాల స్వస్తియా వైద్య శిబిరాన్ని మూడు రోజులుగా హెల్త్ సూపర్వైజర్ హరిణి ఆధ్వర్యం లో పాఠశాలలో నిర్వహిస్తున్నారు.

డాక్టర్ మొగిలి, ఫార్మసిస్ట్ పుష్పాంజలి విద్యార్థులకు పరీక్షలు జరిపి మందులను అందించారు. రక్తంలో హెచ్ బి, విలువ బిఎంఐ, ఎలర్జీ, రక్తహీనత, పుట్టుకతో వచ్చే లోపాలు, విటమిన్ లోపాలు, తదితర లోపాలను గుర్తించి విద్యార్థులకు మందులను అందజేశారు.పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ గోలి జగన్నాథం, వైస్ ప్రిన్సిపాల్ ఆదికొమురయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎం. రేణుక, అధ్యాపకులు శివప్రసాద్, మనోహర్, ఉపాధ్యాయ కార్యదర్శి నరసింహచారి, కార్యాలయ పర్యవేక్షకు లు గుర్రం శ్రీనివాస్ ఉపాధ్యాయులు హాజరయ్యారు.