calender_icon.png 14 August, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

13-08-2025 07:55:39 PM

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): మెనూ ప్రకారం గురుకుల హాస్టల్స్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి(Hanumakonda District Additional Collector A. Venkat Reddy) అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ లోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల, మైనార్టీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, కళాశాలలను జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయాల్లో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను భద్రపరిచిన స్టోర్ రూమ్ లను సందర్శించి కూరగాయలు, ఇతర వంట పదార్థాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు.

విద్యార్థులకు వండిన భోజన పదార్థాలను పరిశీలించి మెనూ ప్రకారం అందిస్తున్నారా అని ఉపాధ్యాయులు, వంట నిర్వాహకులను అదనవు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గురుకుల హాస్టల్స్ లో పరిశుభ్రతను పాటించాలని, ముఖ్యంగా విద్యార్థులకు  శుద్ధమైన తాగునీరును అందించాలన్నారు. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర వస్తువులనే వంటలలో వినియోగించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ మూడు గురుకుల హాస్టల్స్ లో  నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనకు, వాటి నియంత్రణ చర్యలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్ లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.