calender_icon.png 14 August, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సన్ ప్రీత్ సింగ్

13-08-2025 07:53:20 PM

హనుమకొండ (విజయక్రాంతి): రానున్న 72 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించారు. కావున వరంగల్ కమిషనర్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Police Commissioner Sunpreet Singh) ప్రజలకు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని, అలాగే శిదిలావస్థలో వున్న భవనాలు, ఇండ్లల్లో నివసించే వారు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

భారీ వర్షాల కారణంగా పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు సూచనలు చేస్తూ అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి, వాతావరణ శాఖ సూచన మేరకు పనులు షెడ్యూల్ చేసుకోవాలని, వర్షంలో వాహనంపై ప్రయాణించే వారు వాహనాల కండీషన్ పరిశీలించుకోవాలని, వాహనదారులు నిదానంగా డ్రైవింగ్ చేయాల్సి వుంటుందని, అలాగే భారీ వర్షాలున్నప్పుడు బయటకు రావొద్దని, ముఖ్యముగా వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద నిలబడటం ప్రమాదకరమని, విద్యుత్ స్థంబాల దగ్గర్లో నిలబడటం, తాకడం చేయద్దని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే పోలీసులకు అత్యవసర సహాయార్థం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు వరంగల్ జిల్లా కలెక్టరేట్ 1800 4253434, 9154225936 హనుమకొండ కలెక్టరేట్ 18004251115  జి డబ్ల్యూ ఎం సి 1980, 9701999676 విద్యుత్ శాఖ18004250028 లకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలను అప్రమత్తం చేశారు.