17 April, 2026 | 8:45 AM

విద్యార్థులు ఐటీడీఏకు పేరుప్రతిష్టలు తీసుకురావాలి

18-10-2025 12:00 AM

ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, అక్టోబర్ 17 (విజయక్రాంతి) ః క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయి మరియు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పథకాలు సాధించి భద్రాచలం ఐటీడీఏ కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో డివిజన్ స్థాయి గిరిజన స్పోరట్స్ అండ్ గేమ్స్ క్రీడలను ఆయన ప్రారంభించారు. 

అనంతరం విద్యార్థులతో కలిసి టెన్నికాయిట్  వాలీబాల్ క్రీడలు ఆడి విద్యార్థులకు ఉత్సాహపరిచారు. ఈ డివిజన్ స్థాయి క్రీడలలో 250 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటున్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, సంబంధిత పీఈటీలు వారికి ఇష్టమైన క్రీడలలో తర్ఫీదు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, పాఠశాల హెచ్‌ఎంలు సోమశేఖర్, నరసింహారావు, శ్రీనివాసరావు, క్రీడల సెక్రటరీ వసంత్, పీడీలు హరికృష్ణ, వెంకటేశ్వర్లు, జయ, పీఈటీలు వెంకటేశ్వర్లు, బాబురావు, పార్వతి, ఉపాధ్యాయులు హనుమంతు, లక్ష్మణరావు, సర్వేశ్వరరావు, రాజు, వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.