18-10-2025 12:00:00 AM
ఎర్రుపాలెం అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా ఉన్నందుకు సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శుక్రవారం దగ్ధం చేశారు. బీసీ రిజర్వేషన్ల పై ఈ రోజు జరుగుతున్నా చలో రాజ్భవన్ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సీపీఐ(ఎం) ఎర్రుపాలెం మండల కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రిజర్వేషన్లపై బిజెపి ఆడుతున్న నాటకానికి వ్యతిరేకంగా హై స్కూల్ నుంచి రింగ్ సెంటర్ వరకు ప్లే కార్డులతో ప్రదర్శన చేసినారు.
ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు దివ్వేల వీరయ్య మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రం వెంటనే 42 శాతం రిజర్వేషన్లు అమలు బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని, 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బంద్ జయప్రదంకు పార్టీ శ్రేణులకు, బీసీ వర్గాలకు, సామాజిక శక్తులు, విద్యా సంస్థలు, వ్యాపారస్తులు, సహకరించి బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు గామాసు జోగయ్య, నల్లమోతు హనుమంతరావు,షేక్ లాల, గొబ్బూరి కృష్ణంరాజు, బేతు శ్రీను, సగ్గుర్తి వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.