వంతెన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
09-04-2026 01:38 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ ఏప్రిల్ 8: గంగ గట్టు తండ వంతెన నిర్మాణం పనులు త్వరితగతిన నాణ్యతగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రూ. 4.25 కోట్ల రూపాయలతో చేపట్టిన గంగ తండా వంతెన నిర్మాణం పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు.
వర్షాకాలంలో వచ్చే వరద తాకిడికి పలు తండాల గిరిజన వాసుల రాకపోకలకు ఇబ్బంది కలకుండా వంతెన నిర్మాణం జరగాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి, అధ్యక్షుడు హరి కిషన్ నాయక్, సర్పంచులు లచ్చిరాం నాయక్, మాజీ సర్పంచి ఉపాధ్యాయ నాయక్ పోల్ సింగ్ నాయక్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.




