07-08-2025 01:06:06 AM
భీమదేవరపల్లి, ఆగస్టు 6 (విజయ క్రాంతి); విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని, ఒక ఉన్నతమైన లక్ష్యంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ముల్కనూర్ ఎస్త్స్ర సాయిబాబా పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని ఏకేవీఆర్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్త్స్ర మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకుంటారని అన్నారు .ఏ కే వి ఆర్ కళాశాల ప్రిన్సిపల్ భూపతి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులలో రాణిస్తేనే గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో రాంబాబు ,హరికృష్ణ ,ఓదెలు పాల్గొన్నారు.