calender_icon.png 10 August, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్‌ని బలిగొన్న రాజకీయ ఒత్తిళ్లు..?

07-08-2025 01:06:50 AM

  1. అధికార పార్టీ నాయకులు పెట్టిన ఇబ్బందిని మరో నేతతో పంచుకున్న తహశీల్దార్
  2. వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న తహసీల్దార్ చాటింగ్‌లు ?

బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 6: నెన్నెల మండల తహసీల్దార్ జ్యోతిప్రియదర్శి మృతిపై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఆమె గుండెపోటు తో మరణించడానికి భూ దళారులు, రాజకీ య ఒత్తిళ్లే కారణమని పలు ఆరోపణలు వినవస్తున్నాయి. భూ పైరవీలే జీవనాధారంగా పెట్టుకున్న అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ నాయకులు ఇల్లీగల్ పనులు ఆమె పై ఒత్తిళ్లకు పాల్పడటంతో ఎవరికి చెప్పుకోలేక, వారికి ఎదురు చెప్పలేక నిత్యం తహసీ ల్దార్ జ్యోతి మానసిక క్షోభకు గురయినట్లు సమీప సిబ్బంది ద్వారా తెలియవచ్చింది.

తనలో తాను కుమిలిపోయిన విషయం ఆమె మరణంతో బయట పడిందని పలువురు మండల అధికారులు చెప్పుకుంటు న్నారు. అమలుకు సాధ్యం కాని పనులను చేయాలని కొందరు నాయకులు తహసిల్దా ర్‌పై ఒత్తిళ్లు అధికమయ్యాయని, ఇల్లీగల్ పనులు ఎలా చేయడమని, సరిగా ఉంటే చేస్తామని తహసీల్దార్ జ్యోతి తమ గోడును పలువురితో వెల్లబుచ్చుకున్నట్టు తెలుస్తోంది. 

నెన్నెల మండలంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు మరీ ఎక్కువ అయ్యాయాని తహసీల్దార్ స్వయంగా ఓ అధికార పార్టీకి చెందిన లీడర్‌తో వాపోయిందని ఆ సమయంలో ఉన్న వారు తెలిపారు. ప్రధానంగా భూదందా దళారుల ఒత్తిళ్ళు ఆమెను బలి తీసుకున్నాయని వారు మాట్లాడుకుంటున్నా రు. మంగళవారం ఆఫీసుకొచ్చిన  ఓ అధికా ర పార్టీ లీడర్‌తో రాజకీయ ఒత్తిళ్లు మరీ ఎక్కువయ్యాయని ఆమె వాపోయినట్టు సమాచారం.

ఇక్కడ పనిచేయడం చాలా కష్టంగా ఉందనీ మరి ఎక్కడికైనా బదిలీ చేసుకోవాల్సిందేనని తనను కలిసిన ఆ లీడర్‌తో తన గోడును వెళ్ళబోసుకున్న సం ఘటన, ఆమెపై ఉన్న రాజకీయ ఒత్తిళ్ళ తీవ్ర త అద్దం పడుతుంది. ఒక లీడర్‌తో భూ సమస్యపై తహశీసిల్దారు ఆఫీసులో గొడవ జరిగినట్టు కూడా తెలిసింది. పలుకుబడి కలిగిన అధికార పార్టీ లీడర్ల ఒత్తిళ్లు అన్యం పుణ్యమెరుగని ఒక మహిళ తహసీల్దార్ ప్రాణాలను తీశాయని,

విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఆమెకు నిత్యకృత్యంగా మారాయని, ఇదే క్రమంలో తీవ్ర ఒత్తిళ్లు రాజకీయ నాయకుల బెదిరింపులు వెరసి  తహసీల్దారు మర ణం వెనుక దాగి ఉన్న నిజాలు వెలుగు చూస్తున్నాయి. తహశీల్దార్ గుండెపోటుకు కొందరు దళారుల ఒత్తిల్లె ప్రధాన కారణమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ ఒత్తిళ్ళ క్రమంలోనే విధులు  ముగించుకొని మంచిరాలలోని తన నివాసానికి వెళ్లిన కొద్దిసేపటికి తహసీల్దార్ జ్యోతి గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది.

ఆమె మృతి ప్రజల ను షాక్ కు గురిచేసింది. ఈ విషయంపై మండలంలో వాడి వేడిగా చర్చించుకుంటున్నారు. రాజకీయ నాయకులు,ప్రధానంగా భూపైరవీకారులు ఓ మహిళ  తహసీల్దారు ను బలి తీసుకున్నారంటే మండలంలో భూ దందాలు, పైరవీకారులు దళారుల ఒత్తిళ్లు ఎంత క్రూరంగా మారాయో ఆమెమరణమే సాక్షి భూతంగా స్థానికులు భావిస్తున్నారు.

అధికార పార్టీ లీడర్‌తో ఆమె చివరి మాటలు..

నేను నిన్న మధ్యాహ్నం 12 గంటలకు తహశీల్దార్‌ను కలవడం జరిగింది. ఈ మండలంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు బాగా ఉన్నాయని, అధికారులు ఇక్కడికి రావాలంటే చాలా భయపడుతున్నారని ఆమె అన్నారు. నన్ను కూడా ఇక్కడి నుండి వేరే కాడికి పంపియ్యండని బాధతో తెలిపా రు.

కొంత మంది రాజకీయ స్వార్థం కోసం అధికారులని ఇబ్బంది పెడుతున్నారనీ, చేయరాని పని చేయమని బాధపెడుతున్నారని, కరెక్టు ఉంటే ఏ పనైనా చేస్తామని, కానీ కొంతమంది దళారులు భూ సమస్యలపై ఎలాంటి ఆధారాలు లేకుండా నాయకులతో ఫోన్ చేయించి ఒత్తిడి తీసుకు వస్తున్నారని వాపోయారని తెలిపారు. ఇవన్ని ఒక అధికారి పార్టీ సీనియర్ లీడర్‌తో తహశీల్దార్ బాధతో మాట్లాడిన మాటలివి.