calender_icon.png 13 August, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో కోతుల బెడద

10-08-2025 04:00:55 PM

భయం.. భయంగా ప్రజలు..

- కోతుల బెడద తీరేది ఎప్పుడు

- పట్టించుకోని అధికారులు 

- ప్రజల మీదికి ఉసిగొలిపారు

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): కోతుల బెడద తీరేది ఎప్పుడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యం కోతుల వల్ల ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. అధికారులు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కోతుల బెడద మరీ ఎక్కువైంది. అరణ్యాన్ని వదిలి జనరామ్యంలోకి ప్రవేశించిన కోతులు ప్రజాజీవనాన్ని భయకంపితులను చేస్తున్నాయి.  కోతుల సంచారం నిత్య కృత్యంగా మారింది. యావత్ ప్రజలు భయం గుప్పెట్లో బతకాల్సి వస్తుంది. పట్టణంలో ఎక్కడ చూసినా ఏదో ఒక బస్తిలో కోతుల బెడద నిత్య కృత్యంగా మారింది. కోతులు బస్తీల్లోకి వచ్చాయాంటే ప్రజలు ఇళ్లకు తలుపులు వేసుకొని అవి వెళ్లిపోయేంతవరకు భయంగా కాలం గడపాల్సిందే. ప్రతి పల్లె, పట్టణంలో కోతుల బెడద సర్వసాధారణమైంది. ఫలవృక్షాలు ఉన్న గృహాలను లక్ష్యంగా చేసుకొని కోతులు ఆకలి తీర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో అక్కడే తిష్ట వేసి ఉంటున్నాయి.

ఇలాంటి ప్రదేశాల్లో కోతులు దాడులకి గురికావడం పరిపాటిగా మారింది. ఇళ్లల్లోకిచొరబడి తినుబండారాలకు ఎత్తుకెళ్తున్నాయి. ఈ క్రమంలో అడ్డుకోబోతే మరీ దాడి చేసి గాయపరుస్తున్న సంఘటనలు కోకోళ్లలు గా ఉన్నాయి. పిల్లలు వృద్దులు, మహిళల కోతులు దాడులతో భయంతో వణికిపోతున్నారు. దశబ్ద కాలంగా కోతులు బెడదతో ప్రజలు వేగలేకపోతున్నారు. కోతుల బెడదను అధికారులు చూస్తూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వందలాది కోతులు పట్టణంలో జనవాసాలను ఆవాసంగా మార్చుకున్నాయి. ఎక్కడ చూసినా కోతులే దర్శనమిస్తున్నాయి. కోతులు లేని ప్రదేశం అంటూ ఉండదు. ప్రజాజీవనంలో కోతులు అంతర్లీనమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు కోతుల బెడదను పరిగణంలో తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు ప్రతినిత్యం కోతుల బెడదను ఎదుర్కొంటున్నారు. కోతుల భయంతో కాలం గడుపుతున్నారు. కోతులు వచ్చాయంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

వాటి నుంచి రక్షణ కోసం ఇళ్లలోకి పరిగెత్తడం ప్రజలకు నిత్యం కృత్యంగా మారింది. ఎప్పుడు ఎటువైపు నుంచి కోతులు ఎగబడతాయో అన్న భయానిక పరిస్థితి ఉంది. ప్రజలు నిత్యం అప్రమత్తతతో ఉంటున్నారు. ప్రతిరోజూ కోతుల బెడద తప్పడం లేదు. పండ్ల చెట్లు ఉన్న కాలనీ ప్రజలకి కోతుల బెడద మరీ ఎక్కువైంది. కోతుల బెడదను వదిలించుకోవడానికి వృక్షాలను తొలగించుకుంటున్నారంటే అతియోశక్తి కాదు. కోతుల బెడదను అధికారులు తేలిక గా తీసుకోవడం వల్లనే ప్రజలకు రక్షణ కరువైంది. కోతులను తక్కువ చూడొద్దని అంటున్నారు. ప్రజల ప్రాణాలకు మబ్బుగా మారాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్దులకి పెరుగన్నంగా కోతులు దాపరించాయనీ వాపోతున్నారు. కోతుల నుంచి ప్రాణాపాయం నిత్యం పొంచి ఉంది. తరచుగా కోతుల దాడులకు పిల్లలు, వృద్దులు, మహిళలు గురవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు బెల్లంపల్లిలో కోతుల బెడద నివారణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.