07-08-2025 01:04:57 AM
నిర్మల్, ఆగస్టు ౬ (విజయక్రాంతి): నిర్మ ల్ గ్రామీణ మండలంలోని రత్నాపూర్ కాం డ్లి గ్రామ ప్రభుత్వ జడ్పీ హై స్కూల్‌ను కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా పరిశీ లించారు. తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు పాఠాలు బోధించారు ఈ సందర్భంగా తరగతులను పరిశీలించి, విద్యార్థుల హాజరుతోపాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల సరఫరాపై ఆరా తీశారు.
విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారికి పాఠా లు చదివించడంతో పాటు లెక్కలు చేయించారు. పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి బోర్డు పరీక్షల్లో ఉత్త మ ఫలితాల కోసం ఇప్పటినుంచే పకడ్బందీగా సన్నద్ధమవాలని సూ చించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. వంటకు కట్టెల పొయ్యి బదులుగా ఎల్పీజీ వాడాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.వాటి సంరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం కీలకమన్నారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు, తహసిల్దార్ సంతోష్, ఎంపీడీవో గజా నన్, ఎంఈ ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.