09-02-2025 07:45:24 PM
మందమర్రి (విజయక్రాంతి): హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో న్యూ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్ లో పట్టణానికి చెందిన పలువురు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు అందుకున్నారు. ఆదివారం జరిగిన పోటీల్లో పట్టణంలోని బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థులు అండర్ 14 కటాస్ విభాగంలో జి సాయిస్ గోల్డ్ మెడల్, ఆర్ కృతిక్ సిల్వర్ మెడల్, అర్కిళ్ల వినీత్ సిల్వర్ మెడల్, సాదించారు. బహుమతులు సాధించిన విద్యార్థులను సినీ యాక్టర్ భానుచందర్, బిఎంఆర్ అకాడమీ మాస్టర్ బండారి సంతోష్, మాస్టర్ కర్ర వెంకటేష్, శశిలు అభినందించారు.