calender_icon.png 22 November, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరెల్లిలో పేకాటరాయలు అరెస్ట్

09-02-2025 07:42:17 PM

రూ 4.8 లక్షలు, 15 సెల్ ఫోన్లు, జైలో కారు, బైక్ స్వాధీనం...

నిర్వాహకుడి కోసం పోలీసుల గాలింపు..

ఆందోల్: గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న పేకాటపై వట్పల్లి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఆదివారం వట్పల్లి  మండలం మర్వెళ్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై వట్టిపల్లి ఎస్సై-2 విట్టల్ నేతృత్వంలోని పోలీసు బృందం దాడి చేయగా 16 మంది పేకాటరాయల్ని పట్టుకున్నారు. వారిని విచారించి వారి వద్ద నుండి ఒక్కో దాని విలువ 5000 కాగా మొత్తం రూ 3,85,000 కాగా నగదు రూ. 22,875, రెండింటి విలువ రూ. 4,07,875 వీటితో పాటుగా 15 సెల్ ఫోన్లు, ఒక జైలో వాహనం, బైకులను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై విఠల్ తెలిపారు. పేకాట నిర్వహిస్తున్న వారికోసం గాలిస్తున్నట్టు చెప్పారు.