calender_icon.png 22 November, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాధ్యత

09-02-2025 07:48:59 PM

సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ, సామాజిక విశ్లేషకులు దిగంబర్ కాంబ్లే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగం పరిరక్షణ ప్రతీ ఒక్కరి భాద్యత అని సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ, సామాజిక విశ్లేషకులు దిగంబర్ కాంబ్లే అన్నారు. ఆదివారం కౌటాల మండల కేంద్రంలోని జెత్వన్ బుద్ధ విహార్ లో బౌద్ధ సమాజ్ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో బౌద్ధ దమ్మ ప్రబోధన్ కార్యక్రమానికి హైదరాబాద్ లో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ మసాడే లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బౌద్ధ ధర్మ ప్రాముఖ్యత, రాజ్యాంగం పరిరక్షణ అమలు, ఎస్సీ వర్గీకరణ నిరోధం ఆవశ్యకతను వివరించారు. ప్రతీ ఒక్కరూ సన్మార్గంలో, శాంతితో మెలగాలని బుద్దుని బోధనలు చెబుతున్నాయని అన్నారు.

రాజ్యాంగం పరిరక్షణ అమలు విషయంలో పాలకుల పాత్ర కీలకమైన అంశమని అన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగం ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. పేద బడుగు బలహీనర్గాలకు మేలు చేసే ఏకైక మార్గం రాజ్యాంగంతోనే సాధ్యమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఎస్సీ లను రాజకీయాలకు వాడుకునేల వ్యవహరిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సుప్రీం కోర్టు తీర్పు పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల అందరి ఆమోదంతో వర్గీకరణపై ముందుకు వెళ్లాలని సూచించారు. ఐకమత్యంతో ముందుకు సాగడంతోనే వర్గీకరణ ఆగే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ సమాజ్ తాలూకా అధ్యక్షులు, మాజీ ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్, కౌటల మండల అధ్యక్షులు పూల్జలే బండు రావు, ఉపాధ్యక్షులు రావుల గోమాజి, కర్మన్కార్ ఎమాజీ నాయకులు ధనరాజ్, అశోక్, ప్రకాష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.