16 April, 2026 | 11:32 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు

02-06-2025 02:06 AM

ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, జూన్ 1 (విజయ క్రాంతి): విద్యార్థులు లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. చదువుకు పేద ధనిక బేధం లేదని, చక్కగా చదువుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం స్వచ్ఛంద సంస్థల చేయూత అవసరమని ఆయన పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్యా తండాలోఎన్‌ఎఫ్హెచ్సి ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణా శిబిర ముగింపు కార్యక్రమంలో  ఎమ్మెల్యే పాల్గొని కేసముద్రం,  ఇనుగుర్తి మండల పరిధిలో పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు విజేత పురష్కార్ అవారడ్స్ అందజేసి సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో చైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ , డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్, డాక్టర్ జె. రాజారాం,  కేసముద్రం ఎస్.ఐ. మురళీధర్ రాజ్,  లీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాసుల రవికుమార్, బ్రహ్మ సమాజ్ ప్రతినిధి మధు బిందు, కొమ్ము రాజేందర్, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శాస్త్రవేత్త మోహన్, జనరల్ సెక్రటరీ జయకృష్ణ, డైరెక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.