4 May, 2026 | 7:09 AM

ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

06-02-2025 01:29 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): గజగజ వణికించే చలి నుంచి రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. నిన్న మొన్నటి వరకు చలి బాబోయ్ అన్న జనం ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయని అంటున్నారు. వాతావ రణంలో తేమ శాతం తగ్గిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఫిబ్రవరిలో నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతల్లో ఇది సు మారు 4 నుంచి 5 శాతం ఎక్కువ. రాబోయే 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఆ తర్వాత కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయ ని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

5 రోజుల పాటు ఉదయం వేళల్లో అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని.. రాబోయే 3 రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో సాధార ణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండనుందని అధి కారులు తెలిపారు.