11 April, 2026 | 2:24 PM

సరిపడా యూరియా నిల్వలు

03-01-2026 12:10 AM
  1. రైతులకు కావాల్సినంత సరఫరా చేస్తాం
  2. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, 2025 యాసంగి సీజన్‌లో అక్టోబర్ నుంచి -డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశామని, ఇది గత 8 సంవత్సరాల్లో అత్యధికమని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

--యాసంగిలో డిసెంబర్ వరకు కేంద్ర కేటాయింపులు 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు, ఇప్పటికే 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెప్పించామన్నారు. -రైతులకు అవసరమున్నంత మేరకు యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -రాష్ట్రంలో ఉన్న 12,000 సెంటర్లలో, ఎక్కడో రెండు, మూడు సెంటర్లలో ఉన్న క్యూలైన్ల ను చూపి రాజకీయ పబ్బం గడపాలని అనుకుంటున్నారని, కొందరు రాజకీయ లబ్ధికి పాకులాడితే రైతులు క్ష మించరని విమర్శించారు.

యాప్ ఉండాలి అంటున్న రైతులు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ రాష్ట్రంలో కూడా అమలు చేసామని, -ఆ యాప్‌ను వినియోగించి పత్తి రైతులు పత్తి అమ్మకాలు చేస్తున్నారని మంత్రి తు మ్మల అన్నారు. ఈ యాప్‌ను ఉండాలని రైతులు కోరుకుంటున్నారన్నారు. యూరియా యాప్‌ను రాష్ట్రంలో 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా చేపట్టామని, -యాప్ మీద కూడా లేనిపోని అపోహలు, గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమన్నారు.

-యాప్ ద్వారా డిసెంబర్ 20వ తేదీ నుంచి ఇప్పటివరకు 1.18 లక్షల మంది రైతులు 3.36 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.