calender_icon.png 3 January, 2026 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి గొంతు కోసిన నిందితుడి అరెస్టు

03-01-2026 12:10:17 AM

సికింద్రాబాద్ జనవరి 2 (విజయక్రాంతి) : డబ్బు లావాదేవీల నేపథ్యంలో బోయిన్ పల్లిలో హత్య జరిగింది. బోయిన్‌పల్లికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షకీల్(38), తన మిత్రులు ఆర్.సాయి కిరణ్ అలియాస్ బియ్యం సాయి,అతని సోదరుడు ఉదయ్ కిరణ్, విక్రమ్ స్వామి, షేక్ వలీ, మరో వ్యక్తితో కలిసి ఓల్ బోయిన్ పల్లి చెక్ పోస్ట్ సమీపంలోని  వైన్స్ షాప్‌లోకి వెళ్లి మద్యం సేవించారు. 

ఆ  సమయంలోనే షేక్ షకీల్, ఉదయ్ కిరణ్ మధ్య మొబైల్ ఫోన్లో ఒక లూడో గేమ్ ఆడారు. అందులో ఓడిపోయిన వారు గెలిచిన వారికి రూ.500 చెల్లించాలనే షరతు విధించి గేమ్ ఆడగా అందులో  షేక్ షకీల్ విజేతగా నిలిచాడు. బెట్టింగుగా పెట్టిన రూ.500 ఇవ్వాలని ఉదయ్‌కిరణ్ ను షేక్ షకీల్ కోరగా మధ్యలో కల్పించుకున్న   బియ్యం సాయి ‘మా తమ్ముడినే డబ్బులు అగుతావా’అంటూ కత్తితో షేక్ షకీల్ గొంతు కోసి హతమార్చాడు.  షకీల్  కోడలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.