calender_icon.png 3 January, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలోకి వచ్చిన వారిని ఆదరించాలి

03-01-2026 12:10:31 AM

ప్రజాబలం ఉన్న నేతలను చేర్చుకోవాలి  

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఒక పెద్దమనిషి హెచ్చరించారు 

పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్

మేడ్చల్, జనవరి 2 (విజయక్రాంతి): తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఒక పెద్దమనిషి తమను హెచ్చరించారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం పూడూరు శివారులోని ఆయన నివాసంలో పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి గతం లో దేశంలో రెండు పార్లమెంటు స్థానాలు వచ్చాయని, ఒకటి గుజరాత్‌లో, మరొకటి తెలంగాణలో కాగా, ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హెచ్చరించారని అన్నారు. 21 ఏళ్ల తర్వాత కూడా గుజరాత్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే, తెలం గాణలో 45 ఏళ్ల తర్వాత కూడా అధికారం వస్తుందో రాదో అనే అనుమానంతో ఉన్నారని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను సామాజిక వర్గాల ఆధారంగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రజాబలం ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలన్నారు. పార్టీలో చేరిన వారిని గౌరవించాలని సూచించారు.ప్రధాని మోడీ నేను ఇచ్చాను అని చెప్పుకోరని, నేను సేవకుడిని మాత్రమే, ప్రజల యజమానులు అంటారని అన్నారు. ఇక్కడున్న సంకుచితవాదులు మాత్రం నేను ఇచ్చిన అని గొప్పలు చెప్పుకుంటారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, నేను మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బి. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు విక్రం రెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, నా రెడ్డి నందా రెడ్డి, చంద్రారెడ్డి, శోభమ్మ, రామోజీ సురేష్, సుధాకర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.