22 May, 2026 | 9:50 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి

22-05-2026 08:46 PM

కోదాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరధ

కోదాడ,(విజయక్రాంతి): తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని కోదాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరధ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరినందున చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎక్కువగా నీరు తాగడం, సరైన పోషకాహారం తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లవద్దన్నారు. అత్యవసరం అయితే బయటకు వెళ్లేటప్పుడు పైన టోపీ లేదా తెలుపు రంగు టవల్ తల నిండా చుట్టుకోవాలని, చలువ కళ్లద్దాలు, తెలుపు రంగు కాటన్ దుస్తులు ధరించాలన్నారు. ఆరోగ్యంలో తేడా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.