22 May, 2026 | 9:25 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

22-05-2026 08:49 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా జరిగినప్పటికీ బస్సులో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.

అయితే బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జీఎంఆర్ హైవే సిబ్బంది, భిక్కనూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను క్రమబద్ధీకరించి రాకపోకలు సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.