21 April, 2026 | 3:32 AM

తెలుగోడి శతక గర్జన

21-04-2026 02:19 AM

సెంచరీతో తిలక్ వర్మ విధ్వంసం

ముంబై పరాజయాలకు బ్రేక్

చిత్తుగా ఓడిన గుజరాత్ టైటాన్స్

అహ్మదాబాద్ లో తెలుగోడి బ్యాట్ గర్జించింది. ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న హై దరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. 22 బంతు ల్లో 19 పరుగులే చేసిన తిలక్ తర్వాత 83 రన్స్  కేవలం 22 బంతుల్లోనే బాదేశాడు. ఈ విధ్వంసంతో ఐపీఎల్‌లో తొలి శతకాన్ని అందుకున్న తిలక్ ముంబైకి భారీ స్కోరు అందించాడు. తర్వాత బౌలర్లు చెలరేగడంతో ముంబై పరాజయాలకు బ్రేక్ పడింది. అం తేకాదు పాయింట్ల పట్టికలో ఏడో ప్లేస్‌కు దూసుకొచ్చింది.

అహ్మదాబాద్, ఏప్రిల్ 20 : అసలు ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ ఆరంభం చూ సిన తర్వాత ఎవ్వరూ భారీస్కోరు చేస్తుందని అనుకోలేదు. కేవలం 44 పరుగులకే 3 వికె ట్లు కోల్పోయింది. డికాక్ (13), మలేవర్ (2), సూర్యకుమార్ యాదవ్ (15) పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో తెలుగుతేజం తిలక్ వర్మ, నమన్ ధీర్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. నమన్ ధీర్ 32 బంతుల్లో 45 (6 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు ఔటైన తర్వాత తిలక్ వర్మ రెచ్చిపో యాడు. భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలింగ్‌ను ఉతికారేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ తర్వాత మరింత గా చెలరేగిపోయాడు.

నిజానికి మొదట 22 బంతు ల్లో తిలక్ చేసింది 19 పరుగులే. కానీ ఆ తర్వాత పూనకం వచ్చినట్టుగా రెచ్చిపోయి న తిలక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే మరో 83 పరుగులు బాదేయడం ద్వారా సెం చరీ పూర్తి చేసుకున్నాడు. హా ర్థిక్ పాండ్యాతో కలిసి 81 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పిన తిలక్ వర్మ సెంచరీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లున్నా యి. అసలు తిలక్ సెంచరీ అవుతుందని కూడా ఎవ్వరూ ఊ హించలేదు. అయితే పాండ్యా ఎక్కువసార్లు స్ట్రైకింగ్ ఇవ్వడం, చివర్లో రూథర్ ఫర్డ్ కూడా సపోర్ట్ చేయడంతో తిలక్ శతక్కొట్టాడు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 

వికెట్లకు 199 పరుగులు చేసింది. తి లక్ వర్మ 45 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. తిలక్ వర్మకు ఇదే తొలి శతకం. అలాగే ముంబై తరపున అత్యంత వేగంగా ఐపీఎల్ సెంచరీ సాధించిన జయసూర్య రికార్డును తిలక్ సమం చేశాడు.తర్వాత ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ గట్టిపోటీ ఇస్తుందనుకుం టే చేతులెత్తేసింది. ఆరంభంలోనే ఆ జట్టు స్టార్ బ్యాటర్లందరూ ఇంటిదారి పట్టా రు. బుమ్రా ఎట్టకేలకు తొలి వికెట్ సాధించాడు.

సాయి సుదర్శన్‌ను డకౌ ట్‌గా పెవిలియన్ కు పం పాడు. బట్లర్ (5), శుభమన్ గిల్(14), గ్లెన్ ఫిలిప్స్(6), తెవాటియా(8) అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్ (26), షారూఖ్ ఖాన్(17) కాసేపు ధాటిగా ఆడినా పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. వీరిద్దరూ ఔటైన తర్వాత గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. చివరికి గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో అశ్విని కుమార్ 4 వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో ముంబైకి ఇది రెండో విజయం. 

స్కోరు బోర్డు 

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 199/5 (తిలక్ వర్మ 101 నాటౌట్, నమ న్ ధీర్ 45, హార్థిక్ 15, రబాడ 3/33, సిరాజ్ 1/25 , ప్రసిద్ధ కృష్ణ 1/54)

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 100 ఆలౌట్ ( వాషింగ్టన్ సుందర్ 26, షారూఖ్‌ఖాన్ 17. రబాడ 12 ; అశ్వినీ కుమార్ 4/24, శాంట్నర్ 2/16, ఘజన్‌ఫర్ 2/17 )