24-11-2025 12:00:00 AM
తిలక్ వర్మ,రుతురాజ్‌లకు పిలుపు
వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
ముంబై , నవంబర్ 23 : దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే కెప్టెన్ శుభమన్ గిల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో గిల్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు పగ్గాలు అప్పగించారు.తాత్కాలిక సారథిగా రోహిత్, పంత్, అక్షర్ పటేల్ వంటి పేర్లు వినిపించినా జట్టు కోసం ఎప్పుడూ తన బ్యాటింగ్ స్థానం మా ర్చుకోవడం, వికెట్ కీపింగ్ చేసే రాహుల్‌కే సెలక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు.
గతంలోనూ రాహుల్ సారథిగా వ్యవహరించాడు. ఇప్పటి వరకూ 15 వన్డేల్లో కెప్టెన్సీ చేసిన రాహుల్ 9 విజయాలు అందించాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్ జట్టులోకి తిరిగి వచ్చాడు. పంత్ ఏడాది తర్వాత వన్డే జట్టులోకి రీఎం ట్రీ ఇచ్చాడు. గత ఏడాది చివరిసారిగా ఇండి యా తరపున వన్డే ఆడాడు. రాహుల్‌కు డి ప్యూటీగా పంత్‌కే బాధ్యతలు అప్పగించారు.
బ్యాకప్ వికెట్ కీపర్‌గా ధృవ్ జురెల్ ఎంపికయ్యాడు. అలాగే తెలుగుతేజం తిలక్ వర్మకు కూడా సెలక్టర్లు పిలుపునిచ్చాడు. ప్రస్తుతం తిలక్ వన్డే టీ ట్వంటీ జట్టులో రెగ్యులర్ ప్లే యర్‌గా కొనసాగుతుండగా.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా అడుగుపెట్టాడు. అటు ఇం డియా ఏతో సిరీస్‌లో రాణించిన రుతురాత్ గైక్వాడ్ కూడా వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమైన రవీంద్ర జడేజా కూడా వన్డే జట్టులో మళ్లీ చోటు ద క్కించుకున్నాడు.
అయితే హార్థిక్ పాండ్యా ఇంకా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఎంపి క చేయలేదు. అలాగే ఫాస్ట్ బౌలర్ బుమ్రా కు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విశ్రాంతినిచ్చారు. అటు అక్షర్ పటేల్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. పేస్ ఎటాక్‌లో అర్షదీప్‌సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ చోటు దక్కించుకున్నారు. కాగా నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆరం భం కానుంది.
సౌతాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు :
రోహిత్ శర్మ, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్ కమ్ వికెట్ కీపర్), పంత్ ( వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్‌రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ కృష్ణ, అర్షదీప్‌సింగ్, ధృవ్ జురెల్