04-05-2024 02:00:50 AM
ఖమ్మం, మే3 (విజయక్రాంతి): ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే పోటీ చేస్తున్నానని, అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని సీపీఐ, సీపీఎం బలపర్చిన ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. శుక్రవారం మమత రోడ్డులోని విన్ ఫీల్డ్ స్కూల్ సమీపంలో వైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో అందరూ సమిష్టిగా కృషి చేసి తన కు భారీ మెజారిటీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణ కుమారి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, గుర్రం తిరుమలరావు, చావా నారాయణ తదితరులు పాల్గొన్నారు.