04-05-2024 02:02:03 AM
డబ్బు, మద్యం, తప్పుడు ప్రచారాలతో గెలుపును ఆపలేరు
మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
మేడ్చల్, మే 3 (విజయక్రాంతి): డబ్బు, మద్యం, తప్పుడు ప్రచారాలు బీజేపీ గెలుపును అడ్డుకోలేవని మల్కాజిగిరి పార్లమెం ట్ నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఉన్న దని చెప్పారు. అందరికన్నా ముందుగానే బీజేపీ అభ్యర్థిని ప్రకటించారని, 60 రోజులుగా ప్రజా క్షేత్రంలో ప్రచారం నిర్వహి స్తున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో 12 సీట్ల లో బీజేపీ గెలవడం ఖాయమని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
కాంగ్రె స్ పార్టీ సిట్టింగ్ స్థానమని ప్రగల్బాలు పలుకుతూ కార్యకర్తలకు వెలకడుతూ, ఓటర్లను ప్రలోభపెడుతున్నదని ఆరోపించారు. అసెం బ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను అమలు చేశామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ కేవలం ఆర్టీసీ బస్సు సేవలను మాత్రమే కాస్త అమలు చేశారని, అది కూడా అరకొరగానేనని విమర్శించారు. మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, పింఛన్, రేషన్ కార్డులు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
పేదలకు రిజర్వే షన్లు కల్పించాలనే గొప్ప సంకల్పం బీజేపీదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఓడిపో తామనే భయంతో ఉన్నారని, ఎంపీ సీట్లు గెలువకుంటే ఉన్న సీటు ఊడుతుందనే సందేహంలో ఉన్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల కోసం సైమన్ కమిషన్ తీసుకొస్తే గో బ్యాక్ అంటూ నినదించిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని గుర్తుచేశారు. దేశాన్ని ఐదు దశా బ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందని ఈటల గుర్తుచేశారు.