04-12-2025 01:22:56 AM
గాంధారి సర్పంచ్ అభ్యర్థి రేణుక సంజీవ్ యాదవ్
గాంధారి డిసెంబర్ 3 (విజయ క్రాంతి): గాంధారి సర్పంచ్‌గా మరోసారి ఆదరించండి పాలకునిగా కాదు సేవకునిగా ఉంటానని గాంధారి సర్పంచ్ అభ్యర్థి మమ్మాయి రేణుక సంజీవు యాదవ్ అన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గాంధారి సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం రోజున నామినేషన్ వేయగా రెండోసారి గాంధారి సర్పంచ్ గా గెలిచి తన ఊరు కి సేవ చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా గాంధారి సర్పంచ్ అభ్యర్థి మమ్మాయి రేణుక సంజీవు యాదవ్ మాట్లాడుతూ గాంధారి గ్రామ ముఖాభివృద్ధి మార్చానని మరోసారి అవకాశం ఇస్తే ఆంధారి గ్రామపంచాయతీ అభివృద్ధి దేయంగా పనిచేస్తూ గాంధారి గ్రామ ప్రజలకు సేవకునిగా ఉంటానని అభ్యర్థిస్తూ తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. వైద్య వృత్తి రంగాన్ని సైతం వదులుకొని , రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నిస్వార్థoగా ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సేవ చేయడానికి ముందు ఉంటానని అన్నారు.
గతం లో గాంధారి ప్రధాన రహదారి నడవడనీకె నరకంగా ఉండేదని ఈ రహదారి ని ఎలాగైనా బాగు చేయాలనీ సంకల్పం తో అప్పటి ఎమ్మెల్యే సహాకారం తో అందంగా తీర్చి దిద్ది సెంట్రల్ లైట్లతో కాంతులు వెదజల్లే విదంగా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
చిన్న, పెద్ద అని తేడా లేకుండా గ్రామ పంచాయతీ అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్య లను తీర్చడం లో ఎల్లప్పుడూ ముందు ఉంటానని అన్నారు.. ఎన్నికల ముందు చాలా మంది వస్తారు కాబట్టి ఎవరు అందుబాటులో ఉంటారో, ఏ కష్టం వచ్చిన ప్రజలకు నేను ఉన్నానని భరోసా కల్పిస్తూ అండగా ఉంటానని అన్నారు. కావున గాంధారి గ్రామ ప్రజలు మరో సారి నన్ను బారి మెజారిటీ తో గెలిపించి ఆశీర్వాదించాలని కోరారు.