calender_icon.png 17 August, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవతా కోణంలో ప్రజల సమస్యలను చూడాలి: సీఎం చంద్రబాబు

05-08-2024 01:26:31 PM

అమరావతి: మానవతా కోణంలో ప్రజల సమస్యలను చూడాలని, ప్రజలను అవమానించేలా కాకుండా గౌరవప్రదంగా వారికి మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేసారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ బ్రాండ్ దెబ్బతినేలా సాగిన గత ఐదేళ్ళ పాలన ప్రభావం నుండి బయటపడి రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు గారి విజన్ తో ముందుకు వెళదామని సూచించారు.