నోటాపై ఏం అంటారు?

27-04-2024 12:33:31 AM

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

నోటా విషయంలో  వివరణ కోరిన కోర్టు

న్యూఢిల్లీ: ఎక్కువ మంది ఓటర్లు నోటా ఆప్షన్ ఎంచుకుంటే ఏం చేస్తారనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నోటా విషయంలో దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ పోల్ ప్యానెల్‌ను నోటా నియమనిబంధనలను అధ్యయన చేసి వివరణ ఇవ్వాలని కోరింది. మోటివేషనల్ స్పీకర్ శివ్ ఖేర ఈ పిటిషన్‌ను వేశారు. సీనియర్ అడ్వకేట్ గోపాల శంకరనారాయణన్ పిటిషనర్ తరపున మాట్లాడారు. నోటాకు ఎక్కువగా ఓట్లు వస్తే ఎన్నిక రద్దు చేసి, మళ్లీ ఓటింగ్ నిర్వహించాలి, నోటా కన్న తక్కువ వచ్చిన అభ్యర్థిపై అయిదేళ్లపాటు అనర్హత వేటు వేయాలి పిటిషనర్ పిటీషన్ దాఖలు చేశాడు.