టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
హైదరాబాద్: ఐపీఎల్ 2024 17వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్- పంజాబ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు చేరుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్‌లు గెలిచి దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి కోల్‌కతాతో జరిగే మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడిపోతే హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకునే చాన్స్ ఉంది. ఇక ఇప్పటికే పంజాబ్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరో పక్క ఈ మ్యాచుకు వరుణుడు అడ్డుపడతాడని హైదరాబాద్ ఫ్యాన్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివకే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.






