భారత్‌తో వాణిజ్య చర్చలు అత్యవసరం

27-04-2024 12:36:01 AM

అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం

పాక్ ప్రధానికి ఆ దేశ వర్తకుల సూచనలు

బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధిని చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్

ఇస్లామాబాద్, ఏప్రిల్ 26: భారత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఆ దేశ వ్యాపారవేత్తలు కోరారు. ప్రస్తుతం నగదు కొరతతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌కు ఇది ఆర్థిక, వాణిజ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరు గుపరిచేందుకు పాక్ వర్తకులతో ప్రధాని షరీఫ్ ఇస్లామాబాద్‌లో భేటీ అయ్యారు. ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరు గు పరిచే మార్గాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. ఇంధన వ్యయం అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారంలో వృద్ధి అసాధ్యమని వ్యాపారవేత్తలు వివరించారు. దేశంలో రాజకీయ అస్థి రతను తొలగించాలని సూచించారు. 

మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి. ఐఎంఎఫ్ సహా పలు ఒప్పందాల్లో పురోగతి సాధించాం. ఇలాగే మరికొన్ని ఒప్పందాలు జరగాల్సి ఉంది. అది ముఖ్యంగా భారతదేశంతో వాణిజ్యానికి సంబంధించింది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. అలాగే పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌తో సత్సంబంధాలు నెరపండి అని పాక్ క్యాపిటల్ మార్కెట్ దిగ్గజం ఆరీఫ్ హబీబ్ సూచించారు. ఆర్థిక వృద్ధిపై వచ్చిన ప్రతిపాదనలు గుర్తించినట్లు షెహబాజ్ తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపా రవేత్తలను ఆహ్వానిస్తానని, అన్ని సమస్యల పరిష్కారానికి వారితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. నేను యువకుడిగా ఉన్నప్పుడు మననకు ఆ ప్రాంతాన్ని ఓ భారంగా భావించేవాళ్లు. ప్రస్తుతం ఆర్థికపరంగా ఆ దేశం ఎక్కడికో చేరింది. పారిశ్రా మిక వృద్ధిలో అద్భుత ప్రగతిని సాధించింది. మనం వాళ్లను చూసి సిగ్గుపడుతున్నాం అన్నారు.