15 March, 2026 | 9:32 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

గవర్నర్ల ఇమ్యునిటీపై సుప్రీం విచారణ

20-07-2024 12:05 AM

361 ఆర్టికల్ చెల్లుబాటును పరిశీలిస్తామన్న కోర్టు

న్యూఢిల్లీ, జూలై 19: దేశవ్యాప్తంగా రాష్ట్రాల గవర్నర్ల వ్యవస్థ తీవ్ర వివాదాస్పదం అవుతున్న వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకొన్నది. పదవిలో ఉండగా గవర్నర్లపై నేర విచారణ జరుపకుండా రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 చెల్లుబాటుపై విచారణ జరుపాలని నిర్ణయించింది. ఇటీవల బెంగాల్ గవర్నర్‌పై ఓ మహిళ లైంగిదాడి ఆరోపణలు చేయటం, ఆ కేసు సుప్రీంకోర్టుదాకా చేరటంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకొన్నది. 361 ఆర్టికల్‌పై న్యాయ సమీక్ష చేయాలని బాధితురాలు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.