27-11-2025 04:51:42 PM
ఆరెకటికే రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ జమాల్పూర్ బాలరాజ్..
గజ్వేల్: ఆరెకటికలు ఒకే తాటిపై నిలబడి ఒకే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆరెకటికే రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ జమాల్పూర్ బాలరాజ్ అన్నారు. గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో గజ్వేల్ అరెకటిక సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరెకటికలు అందరూ ఒకే రాష్ట్రం ఒకే ఆరెకటిక అధ్యక్షుడు అనే నినాదంతో బయలుదేరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడం గురించి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి ముడు ఓట్లతో నియోజకవర్గం, జిల్లా అలాగే రాష్ట్ర స్థాయి వరకు అందరిని కలిసి చర్చించుకొని త్వరలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఎన్నికల నిర్వహించి ఆరెకటిక రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటామన్నారు.
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆరెకటికల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఈ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికలు విజయవంతం చేసి ఆరె కటికల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం కళ్యాణకర్ నర్సింగరావు మాట్లాడుతూ ఆరెకటికల యొక్క సామాజిక అంశాలను తెలుసుకోవడానికి ఒక రాష్ట్ర నాయకత్వం ఉండాలనే ఆలోచనతో పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అరెకటికలకు సంబంధించిన అన్ని అంశాల మీద బీసీ కమిషన్ వద్ద గాని, మా సంబంధిత నాయకుల వద్ద గాని మాట్లాడానికి ఒక నాయకత్వం కావాలన్నారు. అలాంటి నాయకత్వాన్ని అందరూ కలిసి ఎన్నుకొని మన సమస్యల మీద ముందుకు వెళ్లాలనే ఆలోచన మన సంఘ పెద్దల నిర్ణయం హర్షించదగిందన్నారు.
గజ్వేల్ నియోజకవర్గం నుండి తమ వంతుగా సంఘ నాయకత్వం ఏర్పాటులో సహాయం అందిస్తామన్నారు. ప్రతి మండలం నుండి సభ్యులను ఓటింగ్ లో పాల్గొనేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో అరేకటికె కమిటీ వైస్ చైర్మన్ నేతిక రవికుమార్, జనరల్ సెక్రెటరీ దండోతికర్ జితేందర్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళీధర్, కళ్యాణ్కర్ కిషన్, జమాల్పూర్ శ్రీనివాస్, కళ్యాణ్కర్ రమేష్, కళ్యాణ్ కర్ శివాజీ, జమాల్పూర్ విటల్, యాదిలాల్, నందలాల్, రాజు, రామచంద్రం, అశోక్, పెద్ద లక్ష్మణ్, శ్రీనివాస్, బన్సిలాల్, నర్సోజి, కేశు, శంకర్, చిన్న లక్ష్మణ్, రమేష్, తుక్కోజి, రాజు, పవన్, సొన్ లాల్, నిఖిల్, చందులాల్, చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు.