calender_icon.png 16 October, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా ఆత్మహత్య..

15-10-2025 08:57:06 PM

జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లిపూర్ గ్రామం షరీనగర్ లో యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను జహీరాబాద్ పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. అల్లిపూర్ కు చెందిన గొల్ల స్వప్న గుజ్జువాడ గ్రామానికి చెందిన శంకర్కు అప్పుగా నాలుగు లక్షలు ఇచ్చింది. అప్పు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని శంకర్కు కోరగా శంకర్ ససేమిరా అంటూ డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వనంటూ తెలపడంతో మనస్తవం చెందిన స్వప్న ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

స్వప్న భర్త చింతల గట్టు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. స్వప్న దిగ్వాల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన మనీ ట్రాన్స్ఫర్ ఇన్ తోపాటు జిరాక్స్ ఎంబ్రాయిడరీ పన్ను నిర్వహిస్తుంది. స్వప్న తల్లిదండ్రులది చింతల గట్టు గ్రామం కాగా ఆమెను కోహిర్ మండలం వెంకటపూర్ గ్రామానికి ఇచ్చారు. భర్త ఏంఆర్ఎఫ్ ఉద్యోగి కావడంతో జహీరాబాద్ లో నివాసం ఉంటున్నారు.