calender_icon.png 4 December, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలి

04-12-2025 12:49:21 AM

కొల్లాపూర్‌లో జిల్లా ఎస్పీ పర్యటన

నాగర్ కర్నూల్ డిసెంబర్ 3 ( విజయక్రాంతి ): నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ బుధవారం కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ పరిస్థితులు, నామినేషన్ క్లస్టర్ల వద్ద భద్రత ఏర్పాట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని సేకరించారు.

రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్టేషన్ ఇన్చార్జ్లను ఆదేశించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. స్టేషన్ల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ పట్ల శ్రద్ధ చూపాలన్నారు. 

మద్యం దుకాణాల లైసెన్సుల తనిఖీ.

ఇటీవల పెంట్లవెల్లి మండలంలో టెండర్లలో ఎంపికై కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాలను ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేయొద్దని హెచ్చరించారు. స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు దూరంగా షాపులు ఉండాలన్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతిపత్రాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు.