04-12-2025 12:50:27 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాం తి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు మనందరం ప్రతిన బూనుదామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభు త్వం దివ్యాంగులకు రూ.6 వేల ఫించను, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, బాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ లాంటివి ఆశ చూపి రెండేళ్లు అవుతున్నా దానిని అమలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.