calender_icon.png 29 December, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడే చంపేశాడు?

29-12-2025 01:49:29 AM

యువతిపై ఆత్మహత్యపై అనుమానాలు

ప్రియుడి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన

సంగారెడ్డి జిల్లా మాణిక్ నాయక్ తండాలో ఘటన

సిర్గాపూర్, డిసెంబర్ 28: అనుమానాస్పద స్థితిలో ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా.. ప్రియుడే చంపాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ముందు యువతి మృతదేహంతో ఆందోళన చేసిన ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మునిగేపల్లి మాణిక్ నాయక్ తండాలో జరిగింది. సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ విట్టల్ నాయక్ తండాకు చెందిన కావేరి (23), కల్హేర్ మండలం మునిగేపల్లి మాణిక్ నాయక్ తండాకు చెందిన సభవతి శ్రీకాంత్ ప్రేమించుకున్నారు.

ప్రేమ విషయం ఇద్దరి ఇళ్లలో చెప్పగా వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో కావేరి, శ్రీకాంత్.. హైద్రాబాద్‌లోని బాలాపూర్‌లో సహాజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మనస్పర్తలు రావడంతో కావేరి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిం ది. అయితే ప్రియుడే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని ఆరోపిస్తూ.. కావేరి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందో బస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల పెద్దలు రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.